కేన్సరు వ్యాదిగ్రస్తునకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం

ఆమదాలవలస : నవంబరు21 : స్థానిక దన్నాణపేట గ్రామవాస్తవ్యుడు మజ్జి సత్యం  గత కొద్ది కాలంగా “ కాన్సర్ ” వ్యాధితో బాధపడుతున్నారు.  ఈయన తన దీన పరిస్తితిని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి వద్ద తెలుపుకున్నారు. తక్షణమే ఆయన స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంప్రదించి  “ సి.యమ్.రిలీప్ పండ్ ” ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చి తద్వారా  2 లక్షల ఏబై వేల రూపాయలు గ్రాంట్ అయ్యేవిధంగా కృషిచేశారు. ఈరోజు ఉదయం గౌరవ స్పీకర్ కాంప్ కార్యాలయంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్  చేతులమీదుగా ఆ చెక్కును కాన్సర్ బాధితుడు మజ్జి సత్యంకు అందజేశారు. బాధితుడు మరియు వారి కుటుంబ సభ్యులు తమను ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి  తమ్మినేని సీతారాం గారికి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ గారికి వారు తమ కృతజ్నతలు తెలుపుకున్నారు.
ఈ‌ కార్యక్రమంలో దన్నాన సత్యనారాయణ, దన్నాన రవి, దన్నాన అజయ్, పెడాడ అశోక్, పీ .కల్యాణ్, డీ. గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.