పలాస : నవంబరు 21: వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరులో ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు యిస్తున్న భృతిని మత్స్యకార భరోసా కార్యక్రమం ద్వారా రూ.10 వేలు యివ్వడం జగుతుందన్నారు. గతంలో రూ.4 వేలు ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి 10 వేలు చేయడం జరిగిందన్నారు. వేట నిషేధ భృతి మత్స్యకార భరోసా క్రింద రూ.13.25 కోట్లు జిల్లా మత్స్యకారులకు ఖాతాల్లో జమ చేసారని తెలిపారు. డీజిల్ పై రాయితీని రూ.9 ఇచ్చుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆక్వా రైతులకు రూ.1.50 పైసలకే యూనిట్ విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. మత్స్యకార భరోసా జమ అయినట్లుగా ఫోన్ లో మెసేజ్ లు రాగానే వారికి వచ్చిన మెసేజ్ ను లబ్ధిదారులు ఆనందంతో మంత్రికి, సభకు చూపించారు.శాసన సభ్యులు డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ 6 మత్స్యకార కులాలు ఉన్నాయి. అగ్ని కుల క్షత్రియులు ఉద్దానం తోటల్లో పనిచేస్తున్నారు. కెవిటిలు వలసలు వెళుతున్నారు. కండ్ర, నెయ్యల వర్గం చెరువులు, వాగుల్లో చేపల వేట అనుకూలంగా లేక వలసలు వెళుతున్నారు. అన్ని వర్గాల మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసామని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం శంకుస్థాపన చేసారని, మత్స్యకారులకు ప్రయోజనం కలుగుటకు మంచినీళ్ల పేట వద్ద జెట్టి నిర్మాణం, ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వేట నిషేధ కాలంలో భృతి రూ.10 వేలకు పెంచుతూ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభం చేసారని చెప్పారు. జిల్లాలో 11 వేల మందికి. నియోజకవర్గంలో 2 వేల మందికి ఈ పధకం ద్ప్వారా లబ్ది చేకూరిందని శాసనసభ్యులు తెలిపారు. మత్స్యకారులకు 9 రూపాయల వరకు డీజిల్ రాయితీ, మత్స్యకారులు వేట సమయంలో మరణిస్తే నష్టపరిహారం క్రింద రూ.10 లక్షలు, రొయ్యల రైతులకు రాయితీపై విద్యుత్తు, పడవలను రాయితీపై కల్పించుటకు , మత్స్యకారులకు అత్యవసరం కానున్న కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేయుటకు, 50 సంవత్సరాల వయస్సు దాటిన మత్స్యకారులకు పింఛను ఇచ్చుటకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలలో గల కండ్ర వర్గాన్ని బిసి -డి నుండి బిసి -ఏ లోకి మార్చాలని కోరారు. భావనపాడు పై ప్రత్యేక కృషి చేయాలని,15 నుండి 20 కిలోమీటర్లకు ఒక మినీ జెట్టి ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆల్చిప్పలు, పీతల పెంపకానికి మన తీరం అనువుగా ఉంటుందనీ, వాటి సాగుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మత్స్యకారులకు వాతావరణానికి మధ్య సంబంధం ఉంటుందని,వారు నిత్యం వాతావరణంతో పోరాటం చేస్తారని తెలిపారు. మత్స్యకారులు ఎక్కువ ఒడిదుడుకులకు గురి అగుతారన్నారు. జిల్లాలో ఒక్క మెఖనైజ్డు బోటు కూడా లేదని అన్నారు. తూతికూడిలో జరిగిన ప్రమాదంలో మన జిల్లా మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. బ్రతుకు తెరువు పూర్తి స్థాయిలో లేక మత్స్యకారులు వలసలు వెడుతున్నారని కలెక్టరు తెలిపారు. తితిలిలో ఇల్లు నష్టపోయిన వారికి 10 వేల ఇళ్ళు కేటాయింపు కేటాయించామని, ఇళ్ళ నిర్మాణానికి అదనంగా రూ.1.50 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.జిల్లాలో 3100 నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయని, వీరికి డీప్ సీ ఫిషింగ్ లో శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మత్స్యకారులకు చక్కగా అందుటకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు తెలిపారురు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఐ కిశోర్, డా కిల్లి కృపారాణి, పేరాడ తిలక్, తమ్మినేని చిరంజీవి నాగ్, నర్తు నరేంద్ర,కోమర దేవ రాజు, అంబటి ఆనంద్, మత్స్యకార సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మత్యకారులకు నిత్యం ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు