శ్రీకాకుళం : డిశంబరు 5 : డిసిసిబి ఛైర్మన్ గా పాలవలస విక్రాంత్, డీసీఎంస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ గురువారం ప్రమాణ స్వీకారం చేసారు. డిసిసిబి, డిసిఎంఎస్ కార్యాలయాల్లో గురు వారం జరిగిన కార్యక్రమాల్లో ప్రభుత్వ నియామకం మేరకు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు పాల్గొన్నారు. ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్, సాయిరాజ్ లకు మంత్రి అభిందించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ డిసిసిబి 1936లో ఏర్పాటు అయిందన్నారు. బ్యాంకును బలోపేతం చేయాలని, అందుకు పూర్తి తోడ్పాటు అందిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తూ వ్యవస్థను బలోపితం చేస్తున్నారని పేర్కొన్నారు.డిసిసిబి ని జిల్లాలో అగ్రగామి బ్యాంక్ గా తీర్చిదిద్దుతామని ఛైర్మన్ గా పదవీ స్వీకారం చేసిన విక్రాంత్ అన్నారు. ఛైర్మన్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. వై యస్ రాజశేఖర రెడ్డి హయాంలో సహకార రంగానికి మంచి తోడ్పాటు అందిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి చేరువ అవుతామని అన్నారు. జిల్లాలో 6 నూతన బ్యాంకు శాఖలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొంటూ 18 ఏటిఎంలు పనిచేస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి సిఇఓ డి.సత్యనారాయణ, జిఎం కిరణ్మయి., అంధవరపు సూరిబాబు, సురంగి మోహన రావు, తదితరులు పాల్గొన్నారు.
నేడు డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం