రాష్ట్ర ఉత్తమ వైద్యాధికారిగా మాదిన

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ పశు వైద్యాధికారి గా శ్రీకాకుళం ఉప సంచాలకులు డా.మాదిన ప్రసాదరావు అవార్డ్ ను అందుకున్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ సంచాలకులు వారి కార్యాలయంలో డైరెక్టర్ శ్రీ ఎం. శ్రీనివాసరావు డా.మాదిన ప్రసాదరావుకు ప్రసంశా పత్రంతో పాటు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఉత్తం అధికారులు గా అవార్డ్ అందుకున్న అధికారులు,మిగతా సిబ్బందికి ఆదర్శంగా వుంటూ,ఉత్తమ పశు వైద్యసేవలు అందిస్తూనే,ప్రభుత్వ పథకాలను సత్వరం ప్రజలకు అందేలా,రైతులతో మమేకమై శాస్త్రీయ, సాంకేతిక సేవలు అందించాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయంలో నియమించబడిన పశు సంవర్ధక సహాయకులు,క్షేత్రస్థాయి సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను పెంచేలా,వైద్య ప్రమాణాలను పాటించేలా అవార్డు గ్రహీతలు కృషి చేయాలని అన్నారు.డా.మాదిన ప్రసాదరావు 22 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యునిగా పని చేసి,ప్రస్తుతం 3 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధకశాఖ శిక్షణా కేంద్రంలోను,బహుళార్ధక పశు వైద్యశాలలో ఉప సంచాలకులు గా పనిచేస్తున్నారు.2007 లో   రాష్ట్ర ఉత్తమ పశు వైద్యాధికారి గాప్రతిష్టాత్మక డా.సి.కె.రావ్ బంగారు పతకం అవార్డును,2014 లో ఉత్తమ అధికారిగా సంక్రాంతి పురస్కారం,2000,2018 లో స్వతంత్ర దినోత్సవ అవార్దు ను,2019 లోగణ తంత్ర దినోత్సవ అవార్డును జిల్లా కలెక్టర్ అవార్డులు ను అందుకున్నారు.2002 లో టెక్కలి రోటరీ క్లబ్ కు అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి,పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పశు సంవర్ధకశాఖ శాఖల్లో పలు విభాగాల్లో జిల్లానోడల్ అధికారిగా, రాష్ట్రస్థాయిలో శిక్షకునిగా చురుగ్గా  పాల్గొన్నారు. గ్రామీణ యువతను పశు సంవర్ధక ఉపాధి రంగంలోకి ఆసక్తి పెంచేలా,రైతుల్లో పాడి,జీవాలు,కోళ్లు పెంపకంలో అవగాహన కలిగేలా,సిబ్బందిలో శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను పెంచేలా ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.రైతులకు, సిబ్బందిగా పశు పోషణ,పాడి సంరక్షణ లో మెళకువలు నేర్పేందుకు స్వంతగా పలు వీడియో లను రూపొందించి, యూట్యూబ్ ఛానల్ ద్వారా సేవలు అందిస్తున్నారు.రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే రిలయన్స్ ఫార్మర్ సెల్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ని రైతుల సమస్యలకు ఫోన్ ద్వారా సూచనలు ఇస్తూన్నారు.ఈటీవీ అన్నదాత మొదలైన టీవీ ప్రోగ్రాంలకు ఇప్పటివరకు డబ్భై ఎనిమిది కార్యక్రమంలో పాల్గొన్నారు.డా.మాదినకు అవార్డు వచ్చిన సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డా.చంద్రశేఖర్,జిల్లా సంయుక్త సంచాలకులు డా.ఈశ్వరరావు,ఉప సంచాలకులు డా.జగన్నాధం, కరుణాకర్, సహాయ సంచాలకులు డా.మన్మదరవు,కృష్ణారావు,బాలకృష్ణ, యోగేశ్వరరావు అభినందించారు.